Wedding: పుకార్లకు చెక్…శోభిత చైతన్య వెడ్డింగ్ కార్డ్ చూశారా… పెళ్లెప్పుడంటే?

Wedding: అక్కినేని నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఆగస్టు నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరు డిసెంబర్ 4వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారట సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ వీరు పెళ్లి పనులు ఆగిపోయాయని పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది అంటూ మరొక వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

ఇలా నాగచైతన్య శోభిత వివాహం రద్దు కావడానికి వారి జాతకాలే కారణమని వీరిద్దరి జాతకం ప్రకారం జాతక పరిహారాలు చేయించిన తర్వాతేనే పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని నాగార్జున తీసుకున్నారని అందుకే వీరిద్దరి వివాహాన్ని రద్దు చేశారు అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో మరోసారి తెరపైకి వేణు స్వామి జ్యోతిష్యాన్ని తీసుకువచ్చారు

వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని వేణు స్వామి చెప్పిన విధంగానే వీరి పెళ్లికూడా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. ఇలా శోభిత నాగచైతన్య పెళ్లి గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలకు పూర్తిగా వారి పెళ్లి తేదీని అధికారకంగా ప్రకటించడమే కాకుండా పెళ్లి కార్డును కూడా షేర్ చేయడంతో ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శోభిత నాగచైతన్య వెడ్డింగ్ కార్డు కనుక చూస్తే వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన జరగబోతోందని తెలుస్తుంది.

ఇలా వీరి వివాహపు తేదీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా వెడ్డింగ్ కార్డు కూడా వైరల్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే వీరి వివాహం రాజస్థాన్లో జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వెడ్డింగ్ కార్డ్ విడుదల చేసినప్పటికీ ఇందులో పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాన్ని వెల్లడించలేదు. దీంతో వీరి వివాహం ఎక్కడ జరగబోతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.