Revanth Reddy: 2 లక్షల రుణమాఫీ చేసాం.. మహారాష్ట్ర పర్యటనలో రేవంత్ రెడ్డి కామెంట్స్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు గత నాలుగు రోజులుగా మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. తెలంగాణలో సూపర్ సిక్స్ హామీలతో అధికారాన్ని అందుకున్న రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కూడా తనదైన శైలిలోనే హామీలను ప్రకటిస్తూ పార్టీ గెలుపుకు కారణం అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్ని పథకాలను అమలు చేశామని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై కేటీఆర్ అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా విమర్శలు కురిపించారు. ఇక్కడ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలలో అన్ని హామీలను అమలు చేసినట్టు అబద్ధాలు చెబుతూ అక్కడ ప్రజల ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించారు కానీ ఇప్పటివరకు రుణమాఫీ దిశగా అడుగులు వేయలేదు.రుణమాఫీ అని ప్రకటించిన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు అలాగే ఏడాదిలోపే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామని రేవంత్ తెలియజేశారు.

ఇక ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా నెల వ్యవధిలోనే అమలులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహించారు. ఏక్ నాథ్ శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలిపారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ కోరారు. ప్రవీణ్ గెలిస్తే ఇక్కడ మీకు ఒక అన్న ఉంటారు. హైదరాబాదులో కూడా మరో అన్నగా నేను మీకు అండగా ఉంటాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.