KTR: గాడ్సే శిష్యుడి రేవంత్ రెడ్డి.. గాంధీజీ విగ్రహం పెడుతాడంట ఫైర్ అయిన కేటీఆర్!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏడాది అవుతున్న తరుణంలోనే ప్రభుత్వ తీరు పట్ల పూర్తి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది తిరిగి బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో కొంతమంది కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇలా పలువురు బిఆర్ఎస్ పార్టీలోకి రావడంతో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ సర్కారు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మూసి నదిపట్ల గట్టిగా ప్రశ్నిస్తే ఆయన మరో కొత్త చరణం ఎత్తుకున్నారని కేటీఆర్ తెలిపారు.బాపు ఘాట్ వద్ద అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు. గాంధీ గారికి విగ్రహాలు ఇష్టం ఉండదని అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మా గాంధీ గారి మనవడు చెప్పారు.

రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు అలాంటి వ్యక్తి గాంధీజీ విగ్రహం పెడతానంటే ఊరుకుంటామా అలాంటి వ్యక్తి గాంధీ విగ్రహాన్ని పెట్టి శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఈయన ఎన్నో వాగ్దానాలను ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీలను అమలు పరచడానికి ప్రభుత్వం వద్ద బడ్జెట్ ఉండదు కానీ మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా లక్ష 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు.

కేవలం రూ.1100 కోట్లతో అయిపోయే మూసీ పునరుజ్జీవం విషయంలో మూసీలో రూ. లక్షా 50 వేల కోట్లు పోసే కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎంత ప్రయోజనం అంటూ ప్రశ్నించారు కదా? మరి మూసీతో మురిసే రైతులెందరూ, మూసీతో కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత? మూసీ మూటల్లో మీ వాటా ఎంత? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.