Kishan Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూసీ ప్రక్షాళన విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పాలి అయితే ఈ మూసీ ప్రక్షాళన విషయాన్ని ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వాటి అమలుకు బడ్జెట్ లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా లక్ష 50వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తీసుకు వస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
ఇకపోతే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ విషయంపై రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మూసీ ప్రక్షాళన నిర్ణయాన్ని పూర్తి చేయాలి అంటే వేలాది ఇల్లు కూల్చేయాల్సి వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
కోటిమంది డ్రైనేజీ నీరు మూసీలోకి వెళ్తుంది ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన చేయాలి అనుకుంటే ముందుగా కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి చూడాల్సి ఉంటుందని వీటి గురించి ఆలోచించకుండా వేలాది ఇళ్లను కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు? అంటూ వరుస ప్రశ్నలు వేశారు.
తులసీ రాంనగర్‌లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన అనే పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. పేదల ఇల్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే ఆయన పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని లేకపోతే ముఖ్యమంత్రి పదవి కూడా ఎక్కువ కాలం ఉండదు అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు సంచలనం అవుతున్నాయి.