Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకో… అధికారం కోసమే అపద్దాలు: రోజా

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రభుత్వ నేతలు చేస్తున్న ఆరోపణలని పచ్చి అబద్దాలేనని తేటతెల్లమయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర తెలుగుదేశం నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అందించడం ఏమో కానీ ఇంట్లో మహిళల పూర్తి వివరాలను తీసుకొని ఆ వివరాలు దుర్వినియోగం చేస్తున్నారని తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేలకు పైగా అమ్మాయిలు అపహరణకు గురి అయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సందర్భాలలో వైకాపా నేతలు పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అయినటువంటి 30 వేల మంది అమ్మాయిలను వెనక్కి తీసుకురావాలి అంటూ పదేపదే తనపై విమర్శలు చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన పత్రులను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె.. కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు టీడీపీ జనసేన చేసిన ఆరోపణలు తప్పు అంటూ బయటపడిందని రోజా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

గత ప్రభుత్వ హయామంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆరోపణలన్ని పచ్చి అబద్ధమని ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయని సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ పార్లమెంటులో స్పష్టం చేసిందని రోజా తెలిపారు. ఈ విషయాల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అధికారం కోసం ఎంతటి అబద్ధాలనైనా చెబుతారా అంటూ రోజా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.