Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల పై మేకర్ దృష్టి సారించారు. ఇక నేడు సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే..ఈ ట్రైలర్ పాట్నాలో ఘనంగా నిర్వహించబోతున్నారు.
ఇక ట్రైలర్ లాంచ్ అనంతరం దేశవ్యాప్తంగా పలు నగరాలలో పట్టణాలలో ప్రమోషన్లను ఇంటర్వ్యూలను నిర్వహించడమే కాకుండా భారీ స్థాయిలో పోస్టర్స్ కూడా ఏర్పాటు చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రమోషన్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రమోషన్లకి కూడా అదే స్థాయిలో ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
ఈ సినిమా కోసం సుమారు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ క్రమంలోనే ప్రమోషన్లకి కూడా ఏకంగా 150 కోట్ల రూపాయల డబ్బును కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా పలు బ్రాండ్లతో కలిసి ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించడానికి మైత్రి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఖర్చు చేసే ఈ డబ్బుతో ఓ మంచి సినిమా చేయొచ్చు అంటూ అభిమానులు కామెంట్లు చేయగా మరి.కొందరు ప్రమోషన్లకి ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.