Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్…ఏపీ డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్!

Revanth Reddy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై మహారాష్ట్రలో హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఈనెల 20 వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరుపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఎన్డీఏ కూటమికి గెలుపుకు కీలక పాత్ర వహిస్తున్నారు.

ఇకపోతే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని బోఖర్‌ తాలూకా పాలజ్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో భోఖర్‌ మహాయుతి అభ్యర్థి జయాచౌహాన్‌, నాందేడ్‌ ఎంపీ అభ్యర్థి సంతుక్‌రావు అంబర్టే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం కులాలను రెచ్చగొట్టి కులరాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. హామీల అమలుతోపాటు పరిపాలనలో ఫెయిల్యూర్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓట్లు పొందాలని ప్రయత్నాలు చేస్తుందంటూ మండిపడ్డారు.

ఇలాంటి తప్పుడు హామీలకు నమ్మి మోసపోవద్దని మహారాష్ట్ర ప్రజలకు సూచించారు. మీ అందరి ఆశీర్వాదంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ తెలిపారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పడంతో ఈయన మాటలు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరి ఏపీలో కూడా కూటమి పార్టీ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఆరు నెలలు అవుతున్న ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కూడా ఏపీలో విఫలమైంది అంటూ మరికొందరు పవన్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.