Pawan Kalyan: నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడగటానికి కాదు… పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా నటుడుగా ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు మాత్రం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. జనసేన పార్టీని స్థాపించిన ఈయన 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడుతున్నారు.

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈయన బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఇలా పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి రాజకీయాలలో కీలకంగా మారారు.

ఈ క్రమంలోనే ఈనెల 20వ తేదీ మహారాష్ట్రలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు జై భవాని జై శివాజీ మహారాజ్ అంటూ ఈయన ప్రసంగాన్ని మరాఠీలో ప్రారంభించడమే కాకుండా మరాఠీలో మాట్లాడుతున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ కూడా చెప్పుకోవచ్చారు. ఇక తాను నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నది ఇక్కడ ప్రజలను ఓట్లు అడగడం కోసం కాదని తెలిపారు..

తాను ఇక్కడికి వచ్చింది మరాఠ వీరులను గుర్తు చేయడానికి అని మరాఠ పోరాట వీధులకు నివాళులు అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు.శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అంటే ఏంటో అర్థం తెలిపిన అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు.