Zebra: టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా కన్నడ స్టార్ డాలీ ధనంజయ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
జీబ్రాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
-జీబ్రాలో బ్యాంక్, గ్యాంగ్ స్టర్ రెండు వరల్డ్స్ వున్నాయి. ఇందులో నాది పవర్ ఫుల్ ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ రోల్. సినిమా అంతా బ్యాంక్ చుట్టూ వుండే ఆర్ధిక నేరాలు చుట్టూ ఉంటుంది. మనం చాలా ఫైనాన్సియల్ క్రైమ్స్ గురించి వింటా ఉంటాము. ఒక కామన్ మ్యాన్ గా మనకి బ్యాంక్ లావాదేవీల గురించి అంత లోతుగా తెలీదు. ఈ సినిమా బ్యాంకింగ్ సిస్టం, అందులోని ఫైనాన్సియల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దర్శకుడు ఈశ్వర్ ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథని రాశాడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
Daali Dhananjay
డైరెక్టర్ ఈశ్వర్ ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
-నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఫైనాన్సియల్ క్రైమ్ గురించి వింటా వుంటాం. కానీ అవి ఎలా జరుగుతాయో తెలీదు. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆయన బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చారు.
-ఈశ్వర్ జీబ్రాని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. కామెడీ, ఫన్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని చక్కగా బ్లెండ్ చేశాడు. జీబ్రా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.
Zebra: సత్య దేవ్ ‘జీబ్రా’ ఫస్ట్ సింగిల్ మెస్మరైజింగ్ మెలోడీ ‘మేరీ తేరీ’ సాంగ్ రిలీజ్
సత్యదేవ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-సత్యదేవ్ వెరీ ఆర్గానిక్ అండ్ వెర్సటైల్ యాక్టర్. నాకు చాలా మంచి స్నేహితుడు. సత్య తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది.
-ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకంగా వుంటుంది. అన్ని క్యారెక్టర్స్ కి కథలో ప్రాముఖ్యత వుంటుంది.
Daali Dhananjay
నిర్మాతల గురించి ?
-ఎస్‌ఎన్ రెడ్డి, బాల, దినేష్ సినిమా అంటే చాలా పాషన్ వున్న నిర్మాతలు. సినిమాకి కావాల్సినది సమకూర్చారు. చాలా గ్రాండ్ గా నిర్మించారు.
రవి బస్రూర్ మ్యూజిక్ గురించి ?
-రవి బస్రూర్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన కేజీఎఫ్, సలార్ సినిమాకి ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. జీబ్రా లో మాత్రం కొత్త రవి బస్రూర్ ని చూస్తారు. మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బీజీఎం అదిరిపోతుంది.
తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని జాలి రెడ్డిగా పిలుస్తుంటారు ఎలా అనిపిస్తుంది ?
-పుష్ప సినిమాలోని జాలి రెడ్డి పాత్ర నా కెరీర్ లో మెమరబుల్. తెలుగు ప్రేక్షకులు మన జాలి రెడ్డి అని వోన్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ పాత్రకు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమని మర్చిపోలేను. తెలుగులో మరిన్ని సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరించాలని వుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ