Sabitha Indra Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణలో రేవంత్ సర్కారు తీరు పట్ల ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈమె తెలంగాణ ప్రజలందరూ కూడా తమకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సమన్యాయ అందించారు.
ఇలా పది సంవత్సరాలపాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచారు అయితే ఆ ప్రతిష్టను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోపే దిగజారుస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రైతులు గిరిజన మహిళలపై ఇంత అరాచకమా వారి పట్ల ఇంత చిన్నచూపు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సర్కారు తీరుపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏడాదికే విసిగిపోయారని.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కోరుకుంటున్నారని ఈమె తెలిపారు. కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎలాంటి పాలన చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ పరిస్థితిలు రాహుల్ గాంధీ కంటికి కనిపించడం లేదా అంటూ ఈమె వరస ప్రశ్నలు వేశారు.
ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అనూహ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను పక్కనపెట్టి మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాలను హైడ్రా పేరుతో కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హైడ్రా నిర్ణయంతో ఎంతోమంది తమ సొంత ఇంటిని కోల్పోవడంతో రేవంత్ సర్కారు పట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి.