దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్వేరు పథకాలను అందిస్తుండగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌తో పాటు పొదుపు ప్రయోజనాలను అందించే స్కీమ్స్ ను ఎంచుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ ప్లాన్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను అందుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ పాలసీ ఇండివిడ్యువల్ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ కాగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు చిన్న వయస్సులోనే పింఛన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ లో 78 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 50,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.
స్థలం, ఇల్లు, ఇతర ఆస్తులు విక్రయించిన వాళ్లు భవిష్యత్తు అవసరాల కోసం ఈ విధంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పెన్షన్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎస్బీఐ స్కీమ్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది.