Daali Dhananjay: తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ హీరో పుష్ప ఫేమ్ నటుడు డాలి ధనుంజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమా ముందు వరకు చాలామంది ప్రేక్షకులకు ధనుంజయ గురించి అంతగా తెలియదు. కానీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుంజయ. ఈ ఒక్క మూవీ తో భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుంజయ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు ధనుంజయ. డాక్టర్ ధన్యతతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తాజాగా నేడు అనగా ఆదివారం నవంబర్ 17న డాలీ ధనుంజయ, ధన్యతల నిశ్చితార్థం వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు. అరసీకెరె లోని కాలేనహళ్లి లో డాలీ ధనుంజయ ఇంట్లో ఈ నిశ్చితార్థం వేడుక సింపుల్గా జరిగింది. ఈ సందర్భంగా ధనుంజయ తన కాబోయే భార్య ధన్యత ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ వేడుకలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూరులో డాలీ ధనుంజయ, ధన్యతల వివాహం జరగనుందట. ఇకపోతే ధనుంజయ విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా అలాగే మాటల రచయితగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య ధన్యత వృత్తిరీత్యా డాక్టర్. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.