టిడిపిని మళ్లీ గిల్లిన పవన్ కళ్యాణ్

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టిడిపి చేసిన ప్రసంగం వ్యర్ద ప్రసంగమని పవన్  ట్వీట్  చేశారు. టిడిపి ప్రసంగంపై పవన్ ట్వీట్టర్ లో ఘాటుగా స్పందించారు. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు ఏపి ప్రత్యేక హోదా ఇవ్వరని ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడే పుట్టిన పిల్లవానిలా కేంద్ర చేత మోసగించబడ్డామని అంటే అది ఎవ్వరు నమ్మరని టిడిపి నాటకాలు ఆపాలని పవన్ అన్నారు. రెండున్నరేళ్ల క్రితమే జనసేన తిరుపతి సభలో చెప్పిందని అప్పుడు జనసేనను తిట్టి గగ్గోలు పెట్టారన్నారు. పాచిపోయిన లడ్డులా ప్రత్యేక ప్యాకేజి ఇస్తే కళ్లకు అద్దుకుని తీసుకునేందుకు సిద్దమయ్యారన్నారు. వ్యక్తిగత రాజకీయాల కోసం నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచి ఈ రోజు పనికిరాని ప్రసంగాలు చేసి ఏమి ప్రయోజనమని పవన్ ట్టిట్టర్‌లో ప్రశ్నించారు.

 

https://platform.twitter.com/widgets.js