Pawan Kalyan: సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పులేదు… పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి ఇప్పుడు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదని బాధితురాలు మరణించిన వెంటనే మానవతా దృక్పథంతో బన్నీ లేదా ఆయన టీమ్ తన కుటుంబాన్ని పరామర్శించి ఉంటే సరిపోయేదని ఈయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి బన్నీపై కక్షతోనే ఇలా చేశారు అనడం సరికాదు రేవంత్ రెడ్డి కిందిస్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడని తెలిపారు. సినిమా బెనిఫిట్ షోలో టికెట్ల రేట్లు పెంచడానికి ఆయన అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహరించలేదని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టారు. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటారు.

ఈ ఘటనలో హీరోని ఒంటరి వాడిని చేశారు ఇక పోలీసుల తీరును కూడా తప్పు పట్టడానికి లేదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే పవన్ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరి తప్పులేదనీ పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ఎవరి తప్పు లేకపోతే అల్లు అర్జున్ పై కేసులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఇలా ఈ టైంలో పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి మాట్లాడటం వెనుక గల కారణం ఏంటి అంటూ మరికొందరు ఆరా తీస్తున్నారు. ఇలా ఈ ఘటనలో ఎవరి తప్పు లేదని, గతంలో సినిమాల విషయంలో జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అంటూ పరోక్షంగా మరోసారి జగన్మోహన్ రెడ్డిని పవన్ తప్పు పట్టడంతో వైకాపా ఫాన్స్ తమదైన శైలిలోని స్పందిస్తున్నారు.