Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి అల్లు అర్జున్ అరెస్టు గురించి అలాగే ఈ వివాదం గురించి స్పందించారు. మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా ఈయన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించిన విషయం తెలిసిందే.
ఇలా ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం అదేవిధంగా తెలంగాణలో సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండా టికెట్ల రేట్లు పెంచకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయంపై సినిమా పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ తప్పు పడుతూ విమర్శలు కూడా చేశారు .ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అభిమాని మరణించిన తర్వాత వారి ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అయింది. ఆస్థానంలో బన్ని మాత్రమే కాదు ఎవరున్నా అలాగే వ్యవహరించాలని తెలిపారు. ఇక బన్నీ వెళ్లలేకపోయినా టీం అయినా వెళ్లి తనని పరామర్శించి రావాలి కదా అని తెలిపారు. సీఎం రేవంత్ పేరు మర్చిపోవటంతోనే తనని అరెస్టు చేశారు అని చెప్పడం సరైనది కాదు. ఆ స్థానంలో బన్నీ కాదు రేవంత్ ఉన్నా కూడా అలాగే చేసేవారు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ కేసు గురించి డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.