Yadamma Raju: దేవుడు పంపిన బిడ్డ… కూతురికి వెరైటీగా పేరు పెట్టిన యాదమ్మ రాజు?

Yadamma Raju: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గా మనకు పరిచయమయ్యారు. అలాంటి వారిలో యాదమ్మ రాజు కూడా ఒకరు ఈయన గత రెండు సంవత్సరాల క్రితం స్టెల్లా అనే యువతీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఇటీవల స్టెల్లా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటివరకు తన కూతురు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం వీరు వెల్లడించలేదు కానీ తాజాగా తన కూతురికి ఒక పేరు పెట్టినట్లు మాత్రం వెల్లడించారు అయితే తన కుమార్తె కోసం ముద్దుగా ఒక నిక్ నేమ్ పెట్టినట్లు యాదమ్మ రాజు స్టెల్లా వెల్లడించారు. మరి తన కుమార్తె ముద్దుపేరు ఏంటి అనే విషయానికి వస్తే…

ఎనిమిదేళ్ల ప్రేమ ప్రయాణం, రెండేళ్ల భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మన కూతురు. మొన్నటివరకు మేం కేవలం భార్యాభర్తలం మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా. మొదటినుంచి కూడా మేము కూతురే పుట్టాలని కోరుకున్నాం ఆ దేవుడు మా కోరిక మేరకు మాకు పాపని ప్రసాదించారు తనే మా సర్వస్వం అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మాకు మా బిడ్డ దేవుడు పంపిన గిఫ్ట్ కావడంతో మేము తనకు గిఫ్టీ అని ముద్దుగా పేరు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా యాదమ్మ రాజు తన కుమార్తె నిక్ నేమ్ ఏంటో బయట పెట్టారు. ప్రస్తుతం తన కుమార్తెకు సంబంధించిన కొన్ని ఫోటోలు యాదమ్మ రాజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఇతర బుల్లితెర సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోటోలలో ఎక్కడ కూడా తన కూతురి ఫేస్ మాత్రం ఈయన చూపించలేదు.