Sudhakar: చిరంజీవికి జీవితాన్ని ప్రసాదించిన సుధాకర్… గుర్తు పట్టలేని స్థితిలో కమెడియన్?

Sudhakar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ మంచి సక్సెస్ అందుకొని ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా గుర్తింపు పొందిన వారిలో సుధాకర్ కూడా ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో హీరోగా సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే అనుకోని కారణాలవల్ల ఈయన కమెడియన్ గా మారాల్సి వచ్చింది. తమిళనాడులో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ ను అప్పట్లోనే ఓ పార్టీ నేతలు ప్రచారానికి రమ్మని పిలిచారు.

ఇలా రాజకీయ ప్రచార కార్యక్రమాలకు ఈయనని ఆహ్వానించారు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇలా తమిళనాడులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయనని కొంతమంది ఇండస్ట్రీలో పూర్తిగా తొక్కేసారని అందుకే తమిళ చిత్ర పరిశ్రమ వదిలి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ కమెడియన్ గా మారిపోయారు. అయితే ఈయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివిధ ప్రాంతాలలో చదువులు చదువుకున్నారు అలాగే తన కోరిక మేరకు సుధాకర్ తండ్రి తనని సినిమాలలోకి పంపించారు.

ఇలా మద్రాసు వెళ్లి శిక్షణ తీసుకుంటున్న సమయంలో చిరంజీవి సుధాకర్ ఇద్దరు కూడా ఒకే గదిలో ఉండి శిక్షణ తీసుకునేవారు అయితే సుధాకర్ కు పునాదిరాళ్లు సినిమాలో అవకాశం వచ్చింది అదే సమయంలోనే భారతీయ రాజా దర్శకత్వంలో మరో అవకాశం కూడా వచ్చింది. పునాది రాళ్ళు సినిమా చేస్తే నా సినిమాలో వేషం ఇవ్వమని భారతీయ రాజా చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో సుధాకర్ అప్పుడు చిరంజీవిని తీసుకెళ్లి పునాదిరాళ్ల చిత్ర నిర్మాతలకు తనని పరిచయం చేశారు.

అలా భారతీయ రాజ దర్శకత్వంలో సుధాకర్ నటించారు పునాదిరాళ్ల సినిమాలో చిరంజీవి అవకాశమందుకున్నారు ఓ రకంగా చెప్పాలి అంటే చిరంజీవికి సినీ కెరియర్ ఇచ్చినది సుధాకర్ అని చెప్పాలి అందుకే ఇప్పటికీ చిరంజీవి సుధాకర్ అంటే ఎనలేని అభిమానం. ఇలా ఇండస్ట్రీలో సుధాకర్ కమెడియన్గా కొనసాగుతూ ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్ రావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈయన పాల్గొన్నారు అయితే తన మాటలు కూడా స్పష్టంగా పలకలేని గుర్తుపట్టలేని స్థితిలో ఈయన ఉన్నారని చెప్పాలి.