Kasturi Shankar: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు వెబ్ సైరీస్లో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కస్తూరి శంకర్ ఒకరు. ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ పలు విషయాలను గురించి ప్రస్తావిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు.
కస్తూరి శంకర్ ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ మాట్లాడుతారు. దీంతో ఆమె వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇటీవల తెలుగు వారి గురించి కస్తూరి శంకర్ మాట్లాడినటువంటి తీరుపై తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆమెపై కేసులు పెట్టారు. ఈ కేసులో కస్తూరి శంకర్ అరెస్టు కావడం జైలుకు వెళ్లడం కూడా జరిగింది అయితే బెయిల్ మీద ఈమె బయటకు వచ్చారు..
ఇలా బెయిల్ మీద బయటకు వచ్చిన కస్తూరి శంకర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టారు. మనిషి అన్న తర్వాత కొన్ని రకాల కోరికలు ఉంటాయి అయితే ఈమె మాత్రం రాత్రి అయితే నేను కోరికలను అనుచుకోలేనని తప్పనిసరిగా నా కోరిక తీరాల్సిందేనని వెల్లడించారు. అయితే ఆ కోరిక తీరిన తర్వాత పొద్దున్నే చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతానని కూడా తెలిపారు.
రాత్రి 9 అయ్యిందంటే చాలు నాకు ఆలు చిప్స్ తినాలనే పిచ్చి కోరిక కలుగుతుంది. ఆ టైంలో అది తినడం మంచిది కాదు కానీ నా కోరికను ఆపుకోలేక తినేస్తాను మరుసటి రోజు ఉదయం అనవసరంగా తిన్నాను కదా అంటూ చాలా ఫీల్ అవుతానని ఈమె తనకు ఉన్నటువంటి వింత కోరికను బయట పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.