Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా ఈయనకు మీడియా వారి నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే తన అన్నయ్య నాగబాబుకి కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు సంచలనంగా మారాయి ఇక ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగబాబుకు ఎలాంటి శాఖలను కేటాయిస్తారు అసలు ఆయన ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయంపై ఎన్నో రకాల సందేహాలు ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కి సైతం ఇదే ప్రశ్న మీడియా వారి నుంచి ఎదురయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఆయన పార్టీకి చేసిన త్యాగానికి తనకు రాజ్యసభ ఇవ్వాలని అనుకున్నాము. కానీ కుదర్లేదని తెలిపారు.
ఇక మా పార్టీలో మంత్రుల ఎంపిక అనేది కులం చూసి కాకుండా వారి పనితీరును చూసి పదవులు కేటాయిస్తున్నట్లు పవన్ తెలిపారు అయితే తన అన్నయ్య నాగబాబు ముందుగా ఎమ్మెల్సీ అయిన తరువాతనే మంత్రిగా క్యాబినెట్ లోకి ఎంట్రీ ఇస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇక వచ్చే నెల నుంచి 15 రోజులు చొప్పున జిల్లాలలో పర్యటనలు చేస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ తెలియజేశారు.
ఇలా తన అన్నయ్య మంత్రి పదవి గురించి పలు విషయాలు తెలిపిన పవన్ కళ్యాణ్ తనకు మాత్రం ఏ శాఖ కేటాయిస్తారు ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.