బేబీ బంప్ తో దర్శనమిచ్చిన సమంత.. విషయం తెలిసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత మయాసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ రకరకాల దేశాలు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది సమంత. అయితే వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ మళ్లీ కెరియర్ లో బిజీ అయిపోయారు. ఆమె తెలుగులో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టు చేయడం లేదు.

ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. అంతే కాదు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది సమంత. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. సమంత సినిమాలకి దూరంగా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. ఆమెకి సంబంధించిన ప్రతి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండేవారు.

అయితే సడన్గా ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆమె బేబీ బంప్ తో కనిపించడం ఏమిటి ఏదైనా సినిమా కోసం ఆమె మేకోవర్ అయిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు, షాక్ అవ్వటం కాదు కోపంతో రగిలిపోతున్నారు.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే అవి ఏఐని ఉపయోగించి సమంత ప్రెగ్నెంట్ అంటూ ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఎవరో కావాలని చేసిన పని. అయితే వీటిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అంటూ పుకార్లు సృష్టించటం నీచం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.