ఈ నెల 24న ఏపి బంద్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ పై బిజెపి, టిడిపిలు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 24 న ఏపి బంద్ కు వైసిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు. బంద్ కు అందరూ సహకరించాలంటూ వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేక హోదా గురించే ప్రస్తావించలేదని రాజ్ నాథ్ ప్రసంగాన్నే చదివారని విమర్శించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత చంద్రబాబుకు ఏమి మిగలలేదని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు సంసారం చేసినప్పుడు గుర్తుకు రాని ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని చంద్రబాబును నిలదీశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నట్టు మండిపడ్డారు.  కేంద్రంపై చంద్రబాబు ధర్మపోరాటం ఉత్తదేనన్నారు. టిడిపికి చెందిన ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలకు కూర్చోవాలని జగన్ సూచించారు. ప్రధాని అవిశ్వాసం పై జరిగిన చర్చలో కనీసం ప్రత్యేక హోదా అంశంపై చర్చించలేదు అందుకే ఏపి లో భారీ ఎత్తున నిరసనలు కూడా చేపడుతామని జగన్ తెలిపారు.