తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసింగ్ ప్రపంచంలో సత్తా చాటుతూ దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ ఈవెంట్‌లో తన టీమ్‌తో కలిసి మూడో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో అజిత్‌పై అభినందనల జల్లు పడుతోంది. విశేషంగా, అజిత్ టీమ్ ‘స్పిరిట్ ఆఫ్ ద రేస్’ అవార్డును కూడా గెలుచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అజిత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. “దుబాయ్ 24హెచ్ రేసింగ్ పోటీలో 991 కేటగిరీలో మూడో స్థానాన్ని, జీటీ4 కేటగిరీలో ప్రత్యేక అవార్డును సాధించిన అజిత్ కుమార్ గారు, మీ టీమ్‌కు హృదయపూర్వక శుభాభినందనలు. ఈ విజయంతో భారతదేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎదిగించారు” అంటూ పవన్ ప్రస్థావించారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “సవాళ్లను ఎదుర్కొనే మీ పట్టుదల, రేసింగ్‌లో సాధించిన ఘనత ఎంతో స్ఫూర్తిదాయకం. మీ జట్టుతో పాటు భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించడం గర్వించదగ్గ విషయమైంది” అన్నారు. అజిత్ రేసింగ్ ప్రేమ, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై సాధించిన ఈ ఘనత అతని ప్రతిభకు నిదర్శనం. సామాన్యంగానే అజిత్ వ్యక్తిగతంగా రేసింగ్ పట్ల ఆసక్తి చూపుతూ ఎప్పటికప్పుడు తన అభిరుచిని పెంచుకుంటూ పోతున్నారు.