Balakrishna: ఇటీవల కాలంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలుస్తున్నాయి అఖండ సినిమా నుంచి వరుస హిట్ సినిమాలతో బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈయన డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతంగా ఉందని ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల పొట్టేళ్లను నరికి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా సూపర్ సక్సెస్ కావడానికి కారణం ఆయన చిన్న కుమార్తె తేజస్విని అని తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం బాలయ్య నటించిన సినిమాలు గమనిస్తే ట్రోలింగ్ స్టఫ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. సింహా ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్ కి గురయ్యాయి.
ఇలా బాలకృష్ణ ఎలాంటి పాత్రలలో చేసిన ట్రోల్స్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రంగంలోకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు దర్శకులను గుడ్డిగా నమ్ముతూ సినిమా భారం మొత్తం దర్శకుల పైన బాలయ్య వేసేవారు దీంతో కొంతమంది దర్శకులు చాలా సిల్లి సిల్లి కథలతో కూడా బాలయ్యతో సినిమాలు చేయటం వల్ల భారీగా ట్రోల్స్ ఎదుర్కోవలసి వచ్చింది.
లెజెండ్ సినిమా నుంచి బాలకృష్ణ కథల ఎంపిక విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడమే కాకుండా కథల విషయంలో తన చిన్న కుమార్తె తేజస్విని సలహాలను కూడా తీసుకుంటున్నారట కథ వినేటప్పుడు ఆమె కూడా తప్పనిసరిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక, ఇతర విషయాలని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడానికి తన చిన్న కుమార్తె కారణమని తెలుస్తుంది.