Tirupathi: తిరుమలలో ఇటీవల తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైకుంఠ ద్వారదర్శన టోకెన్లలు జారీ చేయడంతో ఆ టోకెన్లను తీసుకోవడం కోసం లక్షలాదిమంది భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున భక్తులు గాయాలు పాలు కాగా ఆరు మంది మరణించారు అయితే ఈ విషయంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ భక్తులందరికీ కూడా క్షమాపణలు చెప్పారు అదే విధంగా ఈవో, చైర్మన్ సైతం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే పాలకమండలి సభ్యులందరూ కూడా తమ తప్పిదం కారణంగా భక్తులకు క్షమాపణలు తెలియజేశారు అదేవిధంగా బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారికి క్షమాపణలు చెబుతూ పరిహారాన్ని కూడా అందజేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ విషయమే పాలకమండలి సభ్యులు సమావేశం అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే పలువురు సభ్యులు మరణించిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి స్వయంగా వారికి చెక్ అంద చేస్తున్నారు. ఇకపోతే తాజాగా టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు పరిహారం చెక్కులు అందించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు. తిరుపతిలోనే స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని తెలిపారు ఇక మరణించిన కుటుంబాలకి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.