Tirupathi: తిరుపతి తొక్కిసలాట ఘటన వెనుక ఆ పార్టీ హస్తం ఉంది…. ఎమ్మెస్ రాజు సంచలన వ్యాఖ్యలు!

Tirupathi: తిరుపతి తొక్కిసులాట ఘటనలో భాగంగా చోటు చేసుకున్నటువంటి ఈ విషయం ఎంతో బాధాకరం అని చెప్పాలి ఇలా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జారీ చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకోవడం వల్ల తొక్కిసలాట జరిగింది అయితే ఇందులో భాగంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే ఈ ఘటనలో భాగంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తే ఖచ్చితంగా భద్రతా లోపమే అని స్పష్టమవుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే వారికి అనుకూలంగా ఏర్పాట్లు చేయటంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని స్పష్టమవుతుంది అయితే ఈ ఘటనను కూటమి పార్టీలు వైసిపి పై ఆరోపణలు చేస్తుండగా వైకాపా కేవలం అధికారుల నిర్లక్ష్యమేనంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోని తాజాగా మడకశిర ఎమ్మెల్యే టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఘటన గురించి మాట్లాడుతూ ఈ ఘటన వెనుక వైసీపీ ప్రమేయం ఉందని అనుమానాలు కలుగుతున్నాయి అంటూ వైకాపా పై విమర్శలు కురిపించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే అందరికంటే ముందుగా వైసిపి సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అసలు వారికి ఈ వీడియోలు ఎలా వచ్చాయి అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తొందని ఈయన సందేహాలను వ్యక్తం చేశారు.

ఇలా శవ రాజకీయాలు చేయడం వైకాపాకు ముందు నుంచి కూడా బాగా అలవాటే.వైసీపీ సోషల్ మీడియాలో టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైకాపా తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటుంది అంటూ ఎంఎస్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.