సోయాబీన్ ఆయిల్ ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ ఆయిల్ తో ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది వేర్వేరు ఆయిల్స్ ను ఎన్నో అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆయిల్స్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు. అలాంటి ఆయిల్స్ లో సోయాబీన్ ఆయిల్ కూడా ఒకటి. ఈ ఆయిల్ ను వంట కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతర నూనెలతో పోల్చి చూస్తే ఈ ఆయిల్ వంట చేసుకోవడానికి మంచిదని ఫీలవుతూ ఉంటారు.

అయితే ఈ నూనె వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఒక్క నూనెను మాత్రమే వాడితే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఆయిల్ లో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంలో ఇవి సహయపడతాయి. ఈ నూనెను ఎక్కువగా వాడితే హార్మోన్ల అసమతుల్యత జరిగే ఛాన్స్ ఉంటుంది.

ఫైటో ఈస్ట్రోజన్స్ ఈ ఆయిల్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఇన్సులెన్స్ రెసిస్టెన్స్ పెరగడంతో పాటు ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య బారిన కూడా పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెలోని కొన్ని సమ్మేళనాలు బ్రెయిన్ హెల్త్ ను దెబ్బ తీస్తాయి.

ఇవి మెమొరీ పవర్ పై ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నూనె ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు వేధించే ఛాన్స్ ఉంటుంది. సోయాబీన్ ఆయిల్ ను తరచూ వాడే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిది.