JC Prabhakar Reddy: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు తిరుపతికి చేరుకున్నారు. అయితే అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికి పైగా భక్తులు గాయాలు పాలయ్యారు. ఇలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి స్వామి వారి సన్నిధిలో మరణించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి.
ఇక కూటమినేతలు సైతం ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా తెలియజేశారు. అయితే తాజాగా ఈ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు ఈ ఘటనలో తప్పు మొత్తం చంద్రబాబు నాయుడుది అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ ఘటనలో భాగంగా మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జెసి ప్రభాకర్ రెడ్డి రోజా వ్యాఖ్యలపై స్పందించారు. అసలు తప్పు మొత్తం చంద్రబాబు నాయుడుది ఒకప్పుడు రోజా అని చంద్రబాబునాయుడు రాజకీయాలలోకి తీసుకురాక పోయి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు.
రోజాను రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశారని.. ఈ రోజున ఆయనను విమర్శించే స్థాయికి చేరుకున్నావా.. అంటూ సెటైర్ లు వేశారు.. వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులను మేము ఎదుర్కొన్నాము కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిని గాలికి వదిలేసారు అంటూ జేసి ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు చేశారన్న ఉద్దేశంతోనే జేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇలా తన మాటలతో కూటమి ప్రభుత్వ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.