AP: ఏపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకులు ఇస్తూ వస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మార్క్ కనిపించకుండా ఆయన పేరును కూడా ప్రజలందరూ మరిచిపోయేలా చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కూటమీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలకు పేర్లను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే.
ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కనపడకుండా వినపడకుండా కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా ఓ పథకాన్ని మార్చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి ఇండ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇలా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో జగనన్న పేరుతో కాలనీలను ఏర్పాటు చేశారు ఎంతోమందికి ఇంటి స్థలాలను కూడా కేటాయించిన విషయం తెలిసిందే.
ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కల నెరవేరింది .అయితే ఈ కాలనీలకు జగనన్న పేరు పెట్టడంతో కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. జగనన్న కాలనీల పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి జగనన్న కాలనీలను పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తో పాటు వైయస్సార్ పేరిట ఉన్న పథకాలన్నీ మార్పు చేసింది. ఇప్పుడు గృహ నిర్మాణ పథకాన్ని కూడా పూర్తిగా పేరు మార్చేసింది.
జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట కొన్ని హామీలను ఇచ్చారు ఈ హామీలలో భాగంగా గృహ నిర్మాణానికి జగన్ ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు సెంటు భూమి చొప్పున భారీగా లే అవుట్లను ఏర్పాటు చేస్తూ వాటికి జగనన్న కాలనీలుగా నామకరణం చేశారు. ప్రస్తుతం అవి ఎన్టీఆర్ కాలనీలుగా మారిపోయాయి.