Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు విశాల్ తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒక్కప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విశాల్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇకపోతే విశాల్ నటించిన మద గజ రాజ అనే సినిమా సుమారు 11 సంవత్సరాల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాల్ లుక్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిది.
ఈయన చాలా బక్క చిక్కి పోవటమే కాకుండా చేతులు కూడా వణుకుతూ కనిపించాయి. కళ్లలో నీళ్లు కారుతూ ఎంతో దారుణమైన స్థితిలో కనిపించారు దీంతో ఒక్కసారిగా విశాల్ కి ఏమైంది ఎందుకలా మారిపోయాడు అంటూ ఎంతోమంది ఈయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని అందుకే అలా కనిపించారంటూ వైద్యులు అలాగే తోటి నటీనటులు కూడా వెల్లడించారు అయితే తాజాగా ఈయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని తెలుస్తోంది.
ఇక ఇటీవల విశాల్ కి సంబంధించి మరొక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇందులో విశాల్ గతంలో మాదిరిగా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఇది ఇప్పటి వీడియోనా కాదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే హీరో విశాల్ తన ఆరోగ్యం గురించి స్పందించారు. తన సినిమా ప్రీమియర్ షో సందర్భంగా శనివారం ఈయన పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు బయట పెట్టారు.
మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతున్నాను అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాకు ఎలాంటి సమస్యలు లేవు నా చేతులు కూడా వనకడం లేదు మాటలు కూడా తడబడటం లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి అంటూ తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు.