Roja: తిరుమల టికెట్లు అమ్ముకొని రోజా బెంజ్ కొనింది…..జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు?

Roja: వైసీపీ మాజీ మంత్రి సినీనటి ఆర్కే రోజాపై తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత కొద్దిరోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా తన బస్సుకు నిప్పు పెట్టడంతో ఇది బిజెపి వారి పని అంటూ తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈయన మరోసారి వైకాపా మాజీ మంత్రి అయిన రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలట ఘటన గురించి రోజా వరుస ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం రోజాకు కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడటమే కాకుండా ఆమె గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసిపి హయామంలో రోజా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేదే ఆమెతో పాటు మరో 100 మందిని వెంట వేసుకొని వెళ్లేది.

ఇలా రోజా తరచూ తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్తూ తిరుమలలో విఐపి టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా ? అంటూ ప్రశ్నించారు. రోజా మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి… నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు జేసీ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేస్తారనే విషయం అందరికీ తెలుసు. మీ మంచితనం కూడా అందరికీ తెలుసు అంటూ జేసి మండిపడ్డారు.

కేవలం ఒక తాడిపత్రిలోనే మీ ప్రభుత్వ హయామంలో 890 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని తెలిపారు. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారని నిప్పులు చెరిగారు. టోకెన్ల దందాప్తె రోజా ప్తె విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ విధంగా మాజీ మంత్రి రోజాపై జెసి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై రోజా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.