Trinadha Rao Nakkina: తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నటీ అన్షుపై చేసిన వ్యాఖ్యలు అతనికి సమస్యగా మారాయి. ఈ సందర్భంగా ఆమె శరీరాకృతి గురించి మాట్లాడటమే కాక, సెకండ్ హీరోయిన్ పేరు కూడా మరిచిపోవడం చర్చనీయాంశమైంది.
ఈ వివాదం నేపథ్యంలో త్రినాథరావు తన తప్పును అంగీకరించారు. ‘‘నా మాటల వల్ల అన్షు సహా చాలా మంది బాధపడ్డారని తెలుసుకుని ఆవేదన చెందుతున్నాను. ఎవరినైనా అసౌకర్యానికి గురి చేయడం నా ఉద్దేశం కాదు. తెలిసో తెలియకో చేసిన ఈ తప్పుకు బాధితులందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
అన్షుపై మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపై నెగెటివ్ కామెంట్లు రావడంతో దర్శకుడు తన పేస్ మార్చారు. ‘‘పరిస్థితులు తీవ్రతరం కాకముందే వివరణ ఇవ్వడం మంచిది’’ అనిపించుకుని వీడియో రూపంలో క్షమాపణలు కోరారు. ఆయన వాఖ్యలు చర్చనీయాంశమైనప్పటికీ, క్షమాపణల తర్వాత పరిస్థితి కొంత శాంతించింది.
అయితే, ఈ తరహా సంఘటనలు టాలీవుడ్‌లో తరచుగా జరుగుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్లలో జాగ్రత్తగా మాట్లాడకపోవడం వల్ల ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. త్రినాథరావు లాంటి అనుభవజ్ఞుల నుంచి ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యకరం అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి, క్షమాపణల తర్వాత అన్షు నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇక త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజాకా సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.