కిడ్నీలు భద్రంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలివే.. ఈ తప్పులు చేయొద్దు!

మనలో చాలామంది కిడ్నీల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కసారి కిడ్నీలు దెబ్బ తింటే జీవితాంతం డయాలసిస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. శరీర ద్రవాల మోతాదులను నియంత్రించడం, రెనిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి రక్తపోటును అదుపు చేయడం లాంటి ముఖ్యమైన విధులను కిడ్నీలు నిర్వహిస్తాయని చెప్పవచ్చు.

శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డి తయారీలోనూ కిడ్నీలదే కీలక పాత్ర అని చెప్పవచ్చు. మూత్రవిసర్జన పరిమాణంలో మార్పులు వస్తుంటే కిడ్నీలకు సంబంధించిన సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది. బరువు తగ్గడం, తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం, మూర్చ లాంటి లక్షణాలు కిడ్నీ సమస్యకు సంకేతాలు అని చెప్పవచ్చు. నీరసం, నిస్సత్తువ ఏర్పడి చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తే కిడ్నీ సమస్య అయ్యే ఛాన్స్ ఉంది.

మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించడం, రంగు, పరిమాణంలో మార్పులు ఉంటే కూడా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కండరాల నొప్పి, తిమ్మిరి వంటి కిడ్నీ జబ్బులు వచ్చే ముందు కనిపించే లక్షణాలు అని చెప్పవచ్చు. ఛాతీనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం, గుండెదడగా అనిపించడం, గందరగోళం, జ్ఞాపకశక్తి తగ్గడం కూడా కిడ్నీ వ్యాధి లక్షణాలు అని చెప్పవచ్చు.

కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, తక్కువ కొవ్వు ప్రోటీన్లతో కూడిన సమతులాహారం తీసుకుంటూ ఉండటం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడంతో పాటు ఉప్పు, ప్రోటీన్ , పొటాషియం తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీల సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.