Mazaka: సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన ‘మజాకా’ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్ . ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

సందీప్ కిషన్, రీతు వర్మ ఆర్కె బీచ్‌లో డ్రింక్ చేస్తూ పట్టుబడటంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది వారి అరెస్టుకు దారితీస్తుంది. వారి మధ్య ఘర్షణ త్వరలో ప్రేమగా మారుతుంది.ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి కథతో పాటు, సందీప్ తండ్రి పాత్రలో రావు రమేష్ కు కూడా ఒక ప్రేమకథ వుంది. ఇది కథనానికి మరింత వినోదాన్ని జోడించింది. తండ్రీకొడుకుల డైనమిక్ ఇందులో మెయిన్ హైలైట్. వారి కెమిస్ట్రీ నవ్వులు పంచింది.

మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించారు,. “తమ్ముళ్ళు సీట్లు లేగుస్తాయి…” అనే లైన్‌తో దర్శకుడి సిగ్నేచర్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్ కిషన్ తన డైనమిక్ క్యారెక్టర్ లో అదరగొట్టారు, కంప్లీట్ ఎంటర్ టైనింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణ.

టీజర్‌లో అద్భుతంగా కనిపించే రీతు వర్మ తన పాత్రకు ఆహ్లాదకరమైన హ్యుమర్ కూడా తెస్తుంది. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ లవ్ ఇంట్రస్ట్ గా అలరిచింది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, లియోన్ జేమ్స్ ఎనర్జిటిక్ స్కోర్ టీజర్ ని మరింత ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. బ్రహ్మ కడలి అర్ట్ డైరెక్టర్. స్టంట్స్ ని పృథ్వి పర్యవేక్షిస్తారు.

త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాద్తున్నారు. ఈ కాంబోలో ఇది మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇస్తుంది. టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది, ప్రేక్షకులల్లో క్యురియాసిటీ క్రియేట్ చేసింది. మజాకా ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నా 30వ సినిమా. దీన్ని ఒక భాద్యతగా భావిస్తున్నాను. నా గత సినిమాలు భైరవకోన, రాయన్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఆడియన్స్ నా నుంచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని కోరుకుంటున్నారని వారితో మాట్లాడినప్పుడు తెలిసింది. ముఫ్ఫై సినిమాలు చేయడం అంటే ప్రేక్షకులు ఇచ్చిన వరం. వారు కోరుకున్న సినిమా చేయడం నా బాధ్యత. అలాంటి సమయంలో ‘మజాకా’ నా దగ్గరకి వచ్చింది. ‘మేము వయసుకు వచ్చాం’ సినిమా చూసినప్పటినుంచి త్రినాధ్ గారితో పని చేయాలని వుండేది. ఫైనల్ గా ‘మజాకా’తో కుదిరింది.

త్రినాధ్ గారు, ప్రసన్న చాలా నిజాయితీగా పని చేస్తారు. లియోన్ జేమ్స్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఎంజాయ్ చేస్తారు. అన్షు వెరీ స్వీట్ పర్శన్. రీతూ గారు సూపర్బ్ యాక్టర్. రావు రమేష్ గారు చేసిన ఫాదర్ క్యారెక్టర్ ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆయన సినిమాలో మరో హీరో అనే చెప్పాలి. మా కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. హాస్య మూవీస్ అంటే నా హోమ్ బ్యానర్. రాజేష్ గారికి అనిల్ గారికి ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా పోస్టర్ పై చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుంది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మజాకా నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది. తన పాత్ర చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా చేసింది. రీతు వర్మ ఎక్సలెంట్ యాక్టర్. సందీప్ గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమా తనతో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ కథే అందరినీ ఎంచుకుంది. సినిమా రీలైనన తర్వాత సీట్లు కాదు గేట్లు పగులుతాయనిపిస్తోంది. అంత కామెడీ వుంటుంది సినిమాలో. ప్రతి సీన్ ప్రసన్న గారు అద్భుతంగా రాశారు. ఎమోషన్ సీన్స్ కూడా వుంటాయి. సందీప్ గారు ఎక్సలెంట్ గా చేశారు. నిజార్ చాలా చక్కని ఫోటోగ్రఫీ ఇచ్చారు. నిర్మాత రాజేష్ గారు చాలా ఓపిగ్గా ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఆయనకి పెద్ద విజయం ఇస్తుంది. ఫిబ్రవరి 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

రైటర్ ప్రసన్న మాట్లాడుతూ.. ఇది తండ్రి కొడుకుల కథ. రెండు పాత్రలు తూకం వేసినట్లు కలిసి చేసే సినిమా. సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు కెమిస్ట్రీ అదిరిపోతుంది. రాజా గారు సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా ఆయనకి మంచి విజయాన్ని ఇస్తుంది. ఈ సినిమా డెఫినెట్ గా అదిరిపోతుంది. మా త్రినాథ్ గారితో ఇది నాకు ఐదో సినిమా. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అన్షు ఈ సినిమాతో నాకు దొరికిన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. రీతు గారు చాలా ప్రొఫెషనల్ యాక్టర్. సందీప్ కిషన్ అన్న సినిమా చూపిస్తా మామ సినిమాకి వచ్చిన ఒకే ఒక హీరో అప్పటినుంచి ఆయనతో జర్నీ ఉంది. ఆయనతో ఎప్పటినుంచో సినిమా చేయాలని ఉంది. ధమాకా లాంటి 100 కోట్లు సినిమా మేము చేసిన తర్వాత పర్ఫెక్ట్ టైంలో ఈ సినిమా సందీప్ గారికి ల్యాండ్ అయింది. 100% ఈ సినిమా ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా ఇది. అందరికీ శుభాకాంక్షలు’ అన్నారు.

యాక్టర్ రావు రమేష్ మాట్లాడుతూ.. ప్రసన్న గారు అద్భుతమైన కథ చేశారు. తండ్రి కొడుకుల కథ. తండ్రి పాత్ర త్రూ అవుట్ వుంటుంది. ఇంత లెంత్ పాత్ర చేయాలంటే ముందు కొడుకు ఒప్పుకోవాలి. సందీప్ కి అంత బిగ్ హార్ట్ వుంది. ఇలాంటి పాత్ర నా కెరీర్ లో చేయలేదు. డైరెక్టర్ త్రినాథ్ గారికి నిర్మాతలు రాజేష్ గారు, అనిల్ సుంకర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సందీప్ పెద్ద మనసుతో ఒప్పుకోవడంతోనే ఈ సినిమా పాజిబుల్ అయ్యింది. మా మధ్య చాలా మంచి సీన్స్ వుంటాయి. సీన్స్ అన్నీ అదిరిపోతాయి. త్రినాధ్ ప్రసన్న లది మ్యాజికల్ కాంబినేషన్. ప్రసన్న డైలాగ్స్ రాయరు చప్పట్లు రాస్తారు. నిర్మాతలు లావిష్ గా తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ...మజాకా కథ వినప్పుడు నాన్ స్టాప్ గా రెండు గంటలు నవ్వుకుంటూనే వున్నా. ఈ సినిమాకి ఎవరు కావాలో కథే తీసుకొచ్చింది. మన్మధుడు తర్వాత అన్షు రీలాంచ్ అవుతున్నారు. చాలా మంచి పేరు వస్తుంది. రావు రమేష్ గారి పాత్ర నవ్వించి నవ్వించి ఆడియన్స్ పేపర్లు చించేలా వుంటుంది. సందీప్ గారు కథ వినగానే చేసేద్దామని అన్నారు. డివోపీ మంచి విజువల్స్ ఇచ్చారు. లియోన్ జేమ్స్ మంచి ఆర్ఆర్ ఇచ్చారు. మంచి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశాం. నా బ్యానర్ లో ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నిటి కంటే బెస్ట్ మూవీ తీశానని గర్వంగా చెప్పుకోవచ్చు. ధమాకా తర్వాత త్రినాథ్ గారు ఈ కథ నచ్చి డైరెక్షన్ చేశారు, నా బ్యానర్ కి వందకోట్ల సినిమా ఇస్తున్నారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు

హీరోయిన్ అన్షు మాట్లాడుతూ..’మజాకా’ టీంతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన రాజా గారు త్రినాద్ గారు ప్రసన్న గారికి థాంక్ యూ. రావు రమేష్ గారు, సందీప్ గారు, రీతు అందరికీ థాంక్. చాలా సపోర్ట్ చేశారు. ఇది చాలా మంచి ఎంటర్ టైనర్. మీ అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.

డీవోపీ నిజార్ షఫీ మాట్లాడుతూ.. నేను లోకల్ తర్వాత డైరెక్టర్ త్రినాథ్ గారితో కలసి వర్క్ చేస్తున్నాను. ఇది ఫన్ ఫిల్డ్ మూవీ. కలర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు: రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
DOP: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
స్టంట్స్: పృధ్వీ
పీఆర్వో వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి || MV Mysura Reddy About YS Abhishek Reddy Death || Telugu Rajyam