Game Changer: సంక్రాంతి సందర్భంగా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Chran) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా విడుదల రోజే పైరసీ బారినపడింది. ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అనూహ్య రీతిలో ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం పరిశ్రమలో కలకలం రేపింది. దీనికి సంబంధించి 45 మందితో కూడిన ఓ ముఠా ప్రమేయం ఉందని చిత్రబృందం ఆరోపించింది.
సినిమా విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో మేకర్స్‌ను బెదిరించడమేగాక, పైరసీకి పాల్పడతామని బెదిరింపులు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. మరింతగా, ‘గేమ్ చేంజర్’ (Game Changer) విడుదలకు ముందు రోజే కొన్ని కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా, విడుదలైన తర్వాత హెచ్‌డీ ప్రింట్ లీక్ చేసి టెలిగ్రామ్ వంటి పలు మాధ్యమాల ద్వారా వైరల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ & రేటింగ్
ముఠా సభ్యులపై పూర్తి ఆధారాలు సేకరించిన చిత్రబృందం, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితులు కేవలం లీక్‌కు మాత్రమే పరిమితం కాలేదని, సినిమా మీద నెగటివిటీ స్ప్రెడ్ చేయడంలో కూడా ప్రమేయముందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Pawan Kalyan: పిఠాపురం యువత కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్
గేమ్ చేంజర్ (Game Changer) చిత్రబృందం ప్రకారం, సోషల్ మీడియా వేదికలపై పథకప్రాయంగా దుష్ప్రచారం జరుగుతోందని, సినిమా క్లిప్పులను షేర్ చేయడం, ముఖ్యమైన ట్విస్టులను రివీల్ చేసి ప్రేక్షకుల అనుభూతిని దెబ్బతీయడం వంటి చర్యలతో వెనుక దాగి ఉన్న వ్యక్తులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది. పైరసీ దెబ్బకు బాధపడిన చిత్రబృందం, సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో నిందితులను శిక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది.