YS Jagan: వైయస్ జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు…. పవన్ కు థాంక్స్ చెప్పిన అంబంటి?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నిత్యం నిప్పులు చెరుగుతూ కూటమినేతలు చేసే వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు కౌంటరిస్తూ వార్తలలో నిలుస్తున్నారు మాజీ వైకాపా మంత్రి అంబంటి రాంబాబు. ఈయన నిత్యం సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా సమావేశాలలో మాట్లాడుతూ తమ పార్టీ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే వారికి తమదైన శైలిలోనే సమాధానాలు తెలియజేస్తూ ఉంటారు.

ఇక నిత్యం పవన్ కళ్యాణ్ ను తన ప్రత్యర్థిగా భావించి తనపై ఎన్నో విమర్శలు చేసే అంబటి రాంబాబు మొదటిసారి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఉన్నఫలంగా అంబంటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాలోను పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఈయన కర్నూలు జిల్లాలో పర్యటన చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐఆర్ఇపి)ని సందర్శించారు. ఇది మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అన్నారు. ఒకే చోట సోలార్, విండ్, హైడల్… ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం అద్భుతం అని తెలిపారు. ఈ ప్రాజెక్టు కనక పూర్తి అయితే మన రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్ ఖర్చులో మూడవ వంతు తగ్గుతుందని పవన్ కి ప్రాజెక్టు పై ప్రశంసలు కురిపించారు.

పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా ఉన్న సమయంలో తరచూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసేవారు జగన్ హయాంలో ఏ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ కి రాలేదని ఈయన కారణంగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయామంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల గురించి ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో అంబంటి రాంబాబు స్పందించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ… జగన్మోహన్ రెడ్డి హయామంలో పరిశ్రమలు రాలేదని, ఉన్నవి కూడా పోయాయని విమర్శలు చేస్తున్న సమయంలో జగన్ గారు తీసుకువచ్చిన గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థాంక్స్ అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.