మనలో చాలామంది ఎంతో ఇష్టంగా చిరుధాన్యాలతో వండిన వంటకాలను తింటారనే సంగతి తెలిసిందే. నూనెలో వేయించి తయారు చేసే స్నాక్స్ బియ్యప్పిండి, మైదా పిండి, సెనగపిండి వంటి వాటితో కాకుండా చిరుధాన్యాల పిండితో చేసినా వాటిలో కొవ్వు పదార్ధాలు ఎక్కువగానే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిలో తియ్యదనం కోసం బెల్లం, ఖర్జూరాల పొడి, తేనెలను వినియోగిస్తారు.
అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇవి తరచూ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయనేది అపోహేనని తెలుస్తోంది. ఇందులో ఉండే క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. నూడుల్స్, సేమియా, అటుకుల వంటి వాటిని చిరుధాన్యాలతో చేసినప్పుడు మాత్రం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
చిరుధాన్యాలతో చేసిన నూడుల్స్, పాస్తా, సేమియా వంటి వాటిని మరిన్ని పోషకాలున్న కూరగాయలతో కలిపి తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. నూనె, ఉప్పు వంటివి మోతాదు మించకుండా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మంచి కొవ్వును అందించే బాదం, వేరుశెనగ, పిస్తా, ఆక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఐస్‌క్రీమ్, ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగు, మజ్జిగ, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
బరువు నియంత్రణలో ఉండడం ద్వారా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. విటమిన్ సి, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంచేందుకు ఉపయోగపడి తద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.