Bhatti Vikramarka: వాటి ధరంగానే రైతు భరోసా.. భట్టి విక్రమార్క క్లారిటీ..

Bhatti Vikramarka: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా పథకం గురించి కీలక విషయాలను వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

భూమి యాజమాన్యంపై ఆధారపడే ఈ పథకంలో, వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే రికార్డుల ఆధారంగా పథకం లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

Rythu Bharosa

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు, కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పథకంలో పని చేసినవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని, గ్రామస్థాయిలో అధికారుల సమన్వయంతో పథకాలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లోనే ఖరారు చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. అర్హులైన వారికి అనుమతి పత్రాలను అధికారుల ద్వారా అందజేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణలో ఇందిరమ్మ కమిటీల పాత్రను ప్రస్తావించిన భట్టి విక్రమార్క, ప్రభుత్వ జీవో ప్రకారం అన్ని పథకాలనూ పూర్తి పారదర్శకతతో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు త్వరలోనే మెరుగైన ఫలితాలు ఇవ్వబోతాయని చెప్పారు.

డాకు మహారాజ్ మగాడు|| Director Geetha Krishna Review On Daaku Maharaaj || Balakrishna || TeluguRajyam