Home News కేటీఆర్ తెలియదు... కేసీఆర్ కొడుకు అయితే తెలుసు : వైఎస్‌ షర్మిల

కేటీఆర్ తెలియదు… కేసీఆర్ కొడుకు అయితే తెలుసు : వైఎస్‌ షర్మిల

తెలంగాణ: తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని… రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టామని వైఎస్ షర్మిల అన్నారు. కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత మొదటి సారిగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన వైఎస్‌ షర్మిల,కెసిఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇది నా గడ్డ.. దీనికి మేలు చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించేది లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని… ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల…యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు.

Ys Sharmila Sensational Comments On Ktr

ఈ సమావేశంలో విలేకరులు కేటీఆర్ గురించి లేవనెత్తగా… కేటీఆరా… ఆయనెవరు? అంటూ తనకు తెలియదన్నట్లుగా మాట్లాడారు. పక్కనే ఉన్న ఓ నేత.. కల్వకుంట్ల తారక రామారావు గారు మేడమ్ అని చెప్పగా… ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా? అని నవ్వారు. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?. నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం. పెద్ద మగాడు కదా కేటీఆర్.. ఏం చేస్తున్నారు..? తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించింది అనుకుంటాం. కేటీఆర్ మగాడు అనుకుంటాం అని షర్మిల చెప్పుకొచ్చారు.

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News