Ram Charan: చూడటానికి వచ్చిన అభిమానులు… భోజనం పెట్టి పంపిన చరణ్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో కొంతమంది రామ్ చరణ్ అభిమానులు స్వయంగా హైదరాబాద్లోని రామ్ చరణ్ ఇంటికి వెళ్లి తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా అభిమానులు పెద్ద ఎత్తున తన ఇంటికి రావడంతో రామ్ చరణ్ కూడా వారితో కలిసి సరదాగా కాసేపు మాట్లాడారు అనంతరం అక్కడ వచ్చిన వారికి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయించి కడుపునిండా భోజనం పెట్టి పంపించారు.

ఈ విధంగా అభిమానుల కోసం రామ్ చరణ్ భోజనాలను ఏర్పాటు చేయించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా వచ్చిన అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపించడంతో ఈయన మంచి మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమానులకు ఈయన భోజనం పెట్టి పంపించడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ ఎంతైనా ప్రభాస్ ఫ్రెండే కదా ఆయనలాగే ఈయనకు కూడా అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపించే అలవాట్లు వచ్చాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫుడ్ విషయంలో ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తానే ఏ ఆహార పదార్థాలు అయితే తింటున్నారో అదే ఆహార పదార్థాలను అంతే క్వాలిటీగా తన చుట్టూ ఉన్నవారికి ప్రభాస్ తరచూ తెప్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారికి ఏది ఇష్టమో కనుక్కొని మరి వారికి ఆ ఫుడ్ పంపిస్తూ ప్రభాస్ అందరిని సర్ప్రైజ్ చేస్తుంటారు.