YS Sharmila: వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే వైకుంఠనికి పంపిస్తున్నారు….ప్రభుత్వంపై షర్మిల ఫైర్?

YS Sharmila: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు జారీ చేశారు అయితే ఈ టికెట్ల కోసం లక్షలాదిగా భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో లక్షలాది మంది భక్తులు తోసుకొని రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో భాగంగా సుమారు 6 మంది మరణించారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని ఇక 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు.

నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కీలక ఆదేశాలను జారీ చేస్తూ బాధితులకు సరైన వైద్య సేవలు అందజేయాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు ఇక నేడు ఉదయం తిరుపతికి అధికారులందరూ వరుసగా క్యూకడుతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించడమే కాకుండా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించనున్నారు .

ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బాధితుల పరామర్శ కోసం వెళ్లారు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి సైతం తిరుపతి రుయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు ఇప్పటికే ఈయన తిరుపతి వెళ్లారు. ఇక మరణించిన కుటుంబాలకు ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్క్రీషియ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఘటన పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల భద్రత లోపం కారణంగా వైకుంఠ దర్శనానికి టికెట్లు తీసుకోవడానికి వచ్చిన భక్తులను ఏకంగా వైకుంఠనికే పంపిస్తున్నారు అంటూ ఈమె ఫైర్ అయ్యారు. గోవింద నామస్మరణలు వినిపించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు.

లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారని తెలిసినప్పుడు కూడా అక్కడ భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అంటూ మండిపడ్డారు.ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వారి ఇంట్లో అర్హతలు కలిగి ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని షర్మిల తెలిపారు.