Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఏడాది కాలం పూర్తి అయ్యింది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కాలంలో ఎప్పటికప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరును గుర్తిస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంత్రుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని తెలుస్తుంది
రేవంత్ రెడ్డి త్వరలోనే తన క్యాబినెట్లో మార్పులు చేయబోతున్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు మంత్రులను ఈయన తన క్యాబినెట్ నుంచి తొలగించి మాజీ మంత్రులను చేయబోతున్నారని తెలుస్తోంది. గత ఏడాది కాలం నుంచి ఈయన మంత్రులు ఎమ్మెల్యేలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారని తెలుస్తుంది. ఏ మంత్రులైతే వారి శాఖ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడం, జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండని వారిపై వేటు వేస్తారన్న ప్రచారం సాగుతోంది. కొందరు మంత్రులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా కొంతమంది మంత్రులకు రేవంత్ రెడ్డి పలు మార్లు హెచ్చరించిన వారి వ్యవహార శైలి ఏ మాత్రం మారకపోవడమే కాకుండా వారి వల్ల ఏకంగా ప్రభుత్వానికే చెడ్డపేరు రావడంతో వారిని తొలగించడానికి రేవంత్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇక వేటు పడే మంత్రుల జాబితాలో మొదటి స్థానంలో మహిళ మంత్రి కొండా సురేఖ ఉన్నారని తెలుస్తుంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, వీరితో పటు మరో మంత్రిని కూడా రేవంత్ టార్గెట్ చేసినట్లు సమాచారం. మరి ఆ మూడో మంత్రి ఎవరు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.