Rashmika: కొత్త సంవత్సరం ఎంతో బాధ పెట్టింది… క్షమించండి….వైరల్ అవుతున్న రష్మిక పోస్ట్!

Rashmika: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల రష్మిక పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె మరింత క్రేజ్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా ఈమెకు క్యూ కడుతున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇక తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. అయితే ఉన్నఫలంగా రష్మిక తన సినిమాలన్నింటికీ కూడా బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకు కారణం ఆమె వర్కౌట్స్ చేస్తూ గాయపడటమే కారణం అని తెలుస్తుంది. జిమ్లో వర్కౌట్ చేస్తున్న నేపథ్యంలో తన కాలికి గాయం కావడంతో రష్మిక షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు.

అయితే తాజాగా ఈమె తన కాలికి బ్యాండేజ్ వేసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. నాకు హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో ప్రారంభమైంది అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు వెంటనే బాగవ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నాను ప్రస్తుతం తను ఆశ మోడ్ లో ఉన్నానని తెలిపారు. వారాలు లేదా నెలలు పట్టవచ్చు, దేవునికి మాత్రమే తెలుసు. నేను ఇప్పుడు థమ, సికందర్, కుబేర షూటింగ్ సెట్స్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఆలస్యానికి దర్శకులు క్షమించాలని, నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాననీ దర్శకులకు క్షమాపణలు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో రష్మిక కుడి పాదానికి గాయం తగిలినట్టు తెలుస్తుంది. ఇక రష్మిక స్వయంగా ఈ విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు ఈమె తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.