Allu Arjun: అసలైన గేమ్ ఛేంజర్ అల్లు అర్జునేనా….ఒక్క నెలలో అంతా మారిపోయిందిగా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున మీడియా వార్తలను సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి సంచలనాలను సృష్టించింది.

ఇకపోతే ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ ఇబ్బందులలో కూడా చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. కొంతమంది రాజకీయ నాయకులు అల్లు అర్జున్ వారి స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని ఈయనని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.

ఒక్క నెలలో ఇటు ఇండస్ట్రీని అటు రాజకీయాలను కీలక మలుపు తిప్పిన అల్లు అర్జున్ అసలైన గేమ్ చేంజెర్ అని అనిపించుకున్నారు. ఒక్క నెలలో ఇటు ఇండస్ట్రీని అటు రాజకీయాలను కీలక మలుపు తిప్పిన అల్లు అర్జున్ అసలైన గేమ్ ఛేంజర్ అనిపించుకున్నారు. ఈ ఘటన కారణంగా అటు తెలంగాణ రాజకీయాలలో కూడా సంచలనం జరిగింది.

ఈ ఘటనతో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దెబ్బతో అల్లు అర్జున్ బయటకు వస్తారా అన్న సందేహం కూడా ప్రతి ఒక్కరికి కలిగింది.. అయితే దిల్ రాజు చొరవ తీసుకొని అల్లు అర్జున్ ఈ గండం నుంచి బయటపడేసారని చెప్పాలి. ఇక కోర్టు కూడా అల్లు అర్జున్ కు అనుకూలంగా తీర్పులు ఇవ్వటంతో ఈయనకు భారీ ఉపశమనం కలిగిందన చెప్పాలి. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడమే కాకుండా విదేశాలకు కూడా అనుమతి తెలియజేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది .

ఇక ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను కలవాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. ఇలా ఈ కేసు నుంచి అల్లు అర్జున్ కి భారీ ఉపశమనం లభించింది. ఇకపోతే అల్లు అర్జున్ సినిమా విడుదల నెల రోజులు దాటిపోయిన ఇప్పటికీ కూడా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలైన సినిమాలకు పోటీగా పలు ప్రాంతాలలో కలెక్షన్లను రాబట్టింది. ఒక విధంగా చెప్పాలంటే డిసెంబర్ నెలను అల్లు అర్జున్ మర్చిపోలేని నెలగా గుర్తించుకోవచ్చు.