Revanth Reddy: గేమ్ ఛేంజర్ విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్…. మొట్టిక్కాయలు వేసిన హైకోర్టు?

Revanth Reddy: పుష్ప సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం ఒక అభిమాని మరణించడంతో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలో ఇవ్వను అదే విధంగా సినిమా టికెట్లకు పెంచేది లేదని నిండు అసెంబ్లీలో ఈ విషయం గురించి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదే విషయం గురించి సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినప్పటికీ ఆయన మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో సినిమా పెద్దలు చేసేదేమీ లేక వెనుతిరి గారు. అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకి ఏపీలో భారీగా సినిమా టికెట్ల రేట్లు పెంచారు అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి తెలిపారు.

ఇక తెలంగాణలో మాత్రం ఈ సినిమాకి ఎలాంటి బెనిఫిట్ షోలు లేవని చెప్పినప్పటికీ నిర్మాత దిల్ రాజు మరోసారి రేవంత్ రెడ్డిని కలిసి ఈ సినిమా బెనిఫిట్ షో లతో పాటు టికెట్ల రేట్లు పెంచడానికి కూడా అనుమతి తెచ్చుకున్నారు. ఇలా రేవంత్ నిర్ణయం పై వెనక్కి తగ్గడంతో పలువురు విమర్శించారు అయితే ఈ విషయంలో హైకోర్టు సైతం రేవంత్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించింది అని చెప్పాలి.

ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ హైకోర్టును ఆశ్రయించారో పిటిషనర్. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునస్సమీక్షించాలని ఆదేశించింది. తెల్లవారుజామున అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం ఒప్పుకుందంటే వాటిని బెనిఫిట్ షోలుగానే పరిగణించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి అర్ధరాత్రి కాడ సినిమాలు ఏంటి రాత్రి రెండు గంటల సమయంలో మీ పిల్లల్ని రోడ్లపై తిరగనిస్తారా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి రేవంత్ నిర్ణయం పై హైకోర్టు సీరియస్ అయిందని చెప్పాలి.