Venkatesh: విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వెంకటేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ స్వయంగా ఒక పాట పాడిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నిజానికి ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ తో పాడించాలని అనుకోలేదట అనిల్ రావిపూడి సైతం వెంకటేష్ గారితో పాట పాడించాలని అనుకోలేదు కానీ ఈ పాట వినమని ఒకరోజు అనిల్ వెంకటేష్ కి ఈ పాటను షేర్ చేయడంతో రాత్రి రెండు గంటల సమయంలో ఈ పాట వింటూ నాకు తెలియకుండానే నేనే డాన్స్ చేస్తూ ఉండిపోయానని తెలిపారు..
ఈ పాటలో ఏదో తెలియని క్రేజీ, ఎనర్జీ ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యిందని తెలిపారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వెంకటేష్, పాడిన పాట గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక వెంకటేష అనిల్ రావిపూడి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.