YSR: వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం… సంచలన విషయాలు బయటపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి!

YSR: ప్రజా నాయకుడిగా ప్రజలందరి మదిలో నిలిచిపోయినటువంటి వారిలో దివంగత నేత ఎన్టీఆర్ గారి తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటికి ప్రజల మదిలో నిలిచిపోయారని చెప్పాలి. ఇలా వారు మరణించిన ప్రజలు వారిని గుర్తు పెట్టుకోవడానికి కారణం వారు చేసిన మంచి పనులే అని చెప్పాలి. వైయస్సార్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ కార్యక్రమం నిమిత్తం బయలుదేరి వెళ్లారు అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం గురించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వైయస్సార్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్నారు. తాజాగా బెజవాడలో ఆత్మీయ కలయికలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్న రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతో సులభమని తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఇక గతంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరిని కోరలేదు ఎవరికి ఒక కప్పు టీ కూడా ఇవ్వలేదు అర్ధరాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పడంతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు.

ఇక రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత నాకు ఈ పదవి వచ్చింది. నిజం చెప్పాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారితో పాటు నేను కూడా అదే రోజు చనిపోవాల్సి ఉండేదని ఈయన తెలిపారు. ఆరోజు రచ్చబండ కార్యక్రమానికి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు తాను కూడా అదే హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండేది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్పు కోసం ఆగానని… నేను వెళ్లలేకపోయాము అందుకే మేము బ్రతికి బయటపడ్డాము. అలా బ్రతకడం వల్లే నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది తప్ప నేను ఎవరిని ఆ పదవి కోసం ఎవరిని అడగలేదని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.