Balakrishna: మాన్షన్ హౌస్ తో బాలయ్య కటౌట్ కి అభిషేకం…. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబు!

Balakrishna: సంక్రాంతి పండుగ కావడంతో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఈ సంక్రాంతికి కూడా రామ్ చరణ్ బాలకృష్ణ వెంకటేష్ ముగ్గురు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగారు. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు థియేటర్ వద్ద బాలకృష్ణ కటౌట్ ముందు ఏకంగా పొట్టేలు తలనరికి ఆ రక్తంతో బాలయ్య కట్ అవుట్ కు రక్త తిలకం దిద్దుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇలాంటి చర్యలను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

 

ఇలా బాలకృష్ణ కటౌట్ ముందు పొట్టేలను నరకడం ఇది మొదటిసారి కాదు గతంలో అయితే ఏకంగా పొట్టేల తలతో దండ పేర్చి మరి బాలయ్య కటౌట్ కి మాలగా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అమెరికాలో కూడా బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు బాలయ్య కటౌట్ ఏర్పాటు చేసి ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి మాన్షన్ హౌస్ మందుతో అభిషేకం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య మాస్ క్రేజ్ ఏంటో స్పష్టం అవుతుంది. అయితే గత కొంతకాలంగా బాలకృష్ణ వరస హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తున్నారు.