Rayala Seema : రాయలసీమకు సముద్రం వచ్చేసిందోచ్.!

Rayala Seema : సముద్రం రాయలసీమ దగ్గరకు వెళ్ళిందా.? లేదంటే, రాయలసీమే సముద్రం దగ్గరకు వెళ్ళిందా.? ఇప్పుడు చాలామందికి అర్థం కాని ప్రశ్న ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన తిరుపతి జిల్లాకి సముద్రం వచ్చింది.

నిజానికి, సముద్రం ఎక్కడికీ వెళ్ళలేదు.. తిరుపతి జిల్లాలో సముద్రం వున్న ప్రాంతం సాంకేతికంగా కలిసిందంతే. అదీ అసలు సంగతి.

సో, రాయలసీమకు సముద్రం వచ్చేసిందంటూ కొందరు సంబరపడుతున్నారు. రాయలసీమకు సముద్రం రావడమేంటి.? నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్ర తీరం ఓ వరం. రాష్ట్రంలో కోస్తా ప్రాంతం.. మిగతా అన్ని జిల్లాలకీ బలం. ఫలానా ప్రాంతం, ఫలానా కులం, ఫలానా మతం..

అంటూ విభజన రేఖలు గీసుకోవడం వల్లనే ఈ దుస్థితి.

ఎలాగైతేనేం, సీమలో.. కోస్తా ప్రాంతం కలిసింది.. సో, సీమ.. అని ఇకనుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. ఉత్తరాంధ్రకి సంబంధించిన కొంత భూభాగం.. తూర్పుగోదావరిలో వున్న భూ భాగంతో కలిసింది.. ఇలా చాలా మార్పులు జిల్లాల విభజనతో జరిగాయి.

తూర్పు గోదావరిలో పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ప్రాంతాలు కలిశాయి.

అన్నట్టు, ఈ కలయికలతో ‘ఉనికి కోల్పోతున్నాం’ అనే భావన కొందరిలో వుంటే వుండొచ్చుగాక. నిజానికి, భారతదేశమంతా ఒక్కటేనన్న భావన వుండాలి అందరిలోనూ. కానీ, అదే వుంటే ఇన్ని సమస్యలెందుకొస్తాయ్.?

ఏది ఏమైనా జిల్లాల పునర్యవస్థీకరణతో మేలు ఎక్కువ జరిగేటట్టే కనిపిస్తోందన్నమాట.