Borugadda Anil: నా కష్టం పగవాడికి కూడా రావద్దు… నా చావుకు బాబు పవన్ లోకేష్ కారణం: బోరుగడ్డ అనిల్

Borugadda Anil: వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారిలో బోరుగడ్డ అనిల్ ఒకరు అయితే ఈయన అప్పట్లో పెద్ద ఎత్తున దందాలు నిర్వహించడమే కాకుండా కూటమి పార్టీలపై కూటమి నేతల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయనని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇలా గత నాలుగు నెలలుగా రాజమండ్రి జైలులో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఇటీవల కాలంలో హైకోర్టుకు కూడా బురిడీ కొట్టించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

తన తల్లి అనారోగ్యం పాలవ్వటంతో తనకు చికిత్స చేయించడం కోసం బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే గుంటూరులోని లలిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన కార్డియాలజిస్ట్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా కోర్ట్ ఈయనకు మధ్యంతర పేజీలు జారీ చేసింది అయితే ఈ ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అది తప్పుధృవీకరణ పత్రం అని తెలియడంతో పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో జైలు నుంచి బయటకు వచ్చేసిన బోరుగడ్డ అనిల్ తన సెల్ ఫోన్ అలాగే తన తల్లి సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు అయితే ఉన్నఫలంగా ఈయన ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. గత నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్ల ప్రాణహాని ఉందని, వాళ్ల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఏదైనా జరిగితే అందుకు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే బాధ్యులని ఈయన తెలిపారు. తాను దేవుడిని, జగన్, అలాగే వైయస్సార్సీపి పార్టీని తప్ప మరి ఎవరిని నమ్మనని తెలిపారు.

అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో పోలీసులు కుట్ర పన్నారని, థర్డ్ డిగ్రీ ఇచ్చారని.. నాకు బ్లడ్ కూడా క్లాట్ అయ్యిందని.. కర్నూలులో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. తన తల్లి గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారని ఆమె చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే అంటూ ఈయన ఈ వీడియోలో తెలిపారు. నేను న్యాయవ్యవస్థను మోసం చేయలేదని నాకు న్యాయవ్యవస్థ పై గౌరవం ఉందని ప్రస్తుతం చెన్నైలో తన తల్లిని చూసుకుంటూ ఇక్కడే ఉన్నానని అనిల్ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.