ఆ సమస్యలతో బాధ పడేవాళ్లకు పైనాపిల్ విషంతో సమానం..ఈ విషయాలు తెలుసా?

పైనాపిల్ ఒక పోషకాలున్న పండు, ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, రాగి లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, చర్మం మరియు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, వాపును తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎన్నో అదిరిపోయే ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.

పైనాపిల్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పైనాపిల్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందని చెప్పవచ్చు. అయితే అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లకు పైనాపిల్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు. ఎక్కువగా పైనాపిల్ ను వీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

రోజుకు కేవలం 200 మిల్లీగ్రాములు మాత్రమే పైనాపిల్ తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే మాత్రం కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. షుగర్ తో బాధ పడేవాళ్లు పైనాపిల్ ను తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. పైనాపిల్ ను పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. నోటిపూత సమస్యతో బాధ పడే వాళ్లు సైతం పైనాపిల్ ను తినడం ఆరోగ్యానికి నష్టం చేకూర్చుతుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ ను ఎక్కువగా తీసుకోకూడదు.